MDK: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యమని రేగోడ్ మండల వైద్యాధికారి డాక్టర్ శ్వేత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.