SRD: ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాసం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా సంగారెడ్డిలో శనివారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.