»Sukumar Happy Birthday Sukku Darling Dont Have Any Doubts About Pushpa 2
Sukumar: హ్యాపీ బర్త్ డే సుక్కు డార్లింగ్.. ‘పుష్ప 2’ పై అస్సలు డౌట్స్ వద్దమ్మా!
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా ప్రజెంట్ చేస్తు సుకుమార్ చేసిన పుష్ప మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. పుష్ప2 రిలీజ్ పై ఉన్న డౌట్స్‌కు చెక్ పెట్టేశారు మేకర్స్.
Sukumar: ఈసారి పుష్పరాజ్ చేయబోయే వేట మామూలుగా ఉండదని.. ఇప్పటికే ఓ వీడియోతో చెప్పేశాడు సుకుమార్. ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతున్నామని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నారు. అయితే.. రీసెంట్గా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. దాంతో షూటింగ్ కాస్త డిలే అయినట్టుగా తెలుస్తోంది. అలా అని.. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందా? అంటే, ఛాన్సే లేదంటున్నారు.
జనవరి 11న సుకుమార్ పుట్టిన రోజు కావడంతో పుష్ప2 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సుకుమార్‌కు బర్త్ డే విష్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు సినీ ప్రముఖులతో పాటు బన్నీ ఫ్యాన్స్. అలాగే.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు సుకుమార్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. 2024 ఆగస్టు 15న పుష్పరాజ్ వస్తున్నాడని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ కూడా సుక్కుకు బర్త్ డే విష్ చేశాడు. తాను పుష్ప సెట్స్‌లో సుకుమార్‌తో కూర్చొని మాట్లాడుతున్న ఒక హ్యాపీ మూమెంట్ ఫోటోని షేర్ చేస్తు.. నా జీనియస్ సుక్కు డార్లింగ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని.. అని తెలిపాడు.
దీంతో ఈ పోస్ట్‌ని వైరల్ చేస్తోంది అల్లు అర్మీ. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.