»Ktr We Saw The Convenience Of The People But Did Not Think About The Political Advantage And Propaganda
KTR: ప్రజల సౌకర్యమే చూసాము.. కానీ రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేదు
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారన్నారు.
KTR: తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారన్నారు. దేశంలో అత్యధికంగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రచారం చేశారు. కానీ 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. కానీ ఏనాడు కూడా మేం చేసిన వాటిని చెప్పుకోలేదని.. ప్రచారం చేసకోలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచేవాళ్లమని కేటీఆర్ అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేశాం. ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు. ప్రజల సౌకర్యమే చూశాం కానీ.. రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారం గురించి ఆలోచించలేదని కేటీఆర్ అన్నారు.