WGL: సీఎంగా రేవంత్ రెడ్డి 15 ఏళ్ల పాటు పరిపాలన చేయడం ఖాయమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. ఇవాళ నర్సంపేట సభలో ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కష్టపడి పని చేశారని, ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టారన్నారు. మహిళలు, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.