క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డైడ్లైన్ను అందుకునేందుకు గిగ్ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 10 నిమిషాల క్రూరత్వ పద్ధతికి ముగింపు పలకాలని రాజ్యసభలో కోరారు.