ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సంక్షోభానికి కారకులను కఠినంగా శిక్షిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని హామీ ఇచ్చింది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది.