TG: రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి.. అదే స్నేహంగా కొనసాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి కోమటిరెడ్డి వెళ్లారు. చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానన్నారు.