NLG: నార్కట్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన దూదిమెట్ల సత్తయ్య యాదవ్‌ను సర్పంచుగా గెలిపించాలని కోరుతూ శుక్రవారం ప్రచారం చేపట్టారు. రూ.18కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్, కమ్యూనిటీ భవనాలను నిర్మించినట్లు తెలిపారు.