NRML: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల విధుల కోసం అధికారుల తొలి దశ ర్యాండమైజేషన్ను కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో శుక్రవారం పూర్తిచేశారు. మండలాల వారీగా నిర్వహించిన ఈ ప్రక్రియలో అవసరానికి 20% అదనంగా సిబ్బందిని సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీపీవో శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.