NLG: కట్టంగూరు పీఏసీఎస్ ఛైర్మన్ నూక సైదులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కట్టంగూరులో స్థానిక ఎన్నికల విధివిధానాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.