WGL: సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సభకు నర్సంపేట వచ్చే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలపై పోలీసులు అమలు చేసిన హౌస్ అరెస్ట్లు, గృహ నిర్బంధాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే బీజేపీ నాయకులను పోలీసు నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.