ATP: జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం సాయంత్రం సివిల్ సప్లయిస్ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో వీ.సీ. ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందుబాటులో ఉండి సరైన తూకముతో పంపిణీ చేయాలని ఆదేశించారు.