NLR: నరుకూరు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ రోజు మెగా PTM నిర్వహించబడింది. ఈ మీటింగ్కు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు హాజరైనారు. పిల్లల చదువు స్థాయి పెరగాలంటే చేపట్టవలసిన చర్యలను ప్రధానోపాధ్యాయుడు అమృల్లా వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి ప్రయత్నిస్తే పిల్లలను విద్యావంతులుగా తీర్చదిద్దవచ్చని తెలిపారు.