TG: మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు త్వరలో ఆన్లైన్లోనూ అమ్మకాలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరె అందిస్తామని, ఇందిరమ్మ చీరలకు ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు. పేదవాడి తలరాతను మార్చేది చదువు ఒక్కటే అని, పేద బిడ్డలకు నాణ్యమైన చదువు అందించే బాధ్యత తనదే అని చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.