MHBD: కురవి మండలంలోని తట్టుపల్లి, చంద్యాతండాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచందర్ నాయక్ వారికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు.