NZB: సిరికొండ మండలం మైలారం సర్పంచి అభ్యర్థి శ్రీమంతుల రాజు ప్రచారం చేయడానికి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ వీర్ తనవంతుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక సాయం అందించిన ప్రవీణ్‌కు రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ మండల సోషల్ మీడియా రైటర్ రవీందర్, సునీల్ పాల్గొన్నారు.