AP: పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భామినిలో పేరెంట్-టీచర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఇకపై ఏటా DSC చేపడాతమని వెల్లడించారు. మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. ఈనెల 10 నుంచి టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ వన్ చేయాలని ఆకాంక్షించారు.