NLR: అల్లూరు మండలం నార్త్ మోపూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్- టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొప్పతనం గురించి వివరించారు. ఇలాంటి సమావేశాల వల్ల విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు మధ్య బంధం ఏర్పడుతుందన్నారు.