W.G. భీమవరం మండలం గూట్లపాడు లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.O కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలన్నారు.