GNTR: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, విద్య, ప్రవర్తన వంటి అంశాలు పాఠశాల-ఇంటికి మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. నగరంలోని కొత్తపేట కసయమ్మ హైస్కూల్లో జరిగిన సమావేశంలో విద్యార్థులతో కలిసి భవిష్యత్తుకు దోహదపడే పాఠాలు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల బాధ్యతలపై ఎమ్మెల్యే చర్చించారు.