విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని జనసేన నాయకులు కొవ్వాడ సర్పంచి కోట్ల రఘు వెల్లడించారు. పూసపాటిరేగ మండల కేంద్రంలోని కెజిబివి పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అదితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వి రమణ పాల్గొన్నారు.