చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. పాన్ ఇండియా మూవీగా బజ్ జనరేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ఇక ఫస్ట్ రివ్యూలు కూడా వచ్చేశాయి. దీంతో హనుమాన్ అద్భుతమే అంటున్నారు.
Hanuman: జనవరి 12న థియేటర్లోకి రిలీజ్ అవుతున్న హనుమాన్ మూవీ ఓ రోజు ముందే ప్రీమియర్స్‌తో సందడి చేసింది. దీంతో హనుమాన్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఈ సినిమాను చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన వన్ వర్డ్ రివ్యూ ఇచ్చేశారు. వన్ వర్డ్ రివ్యూలో హనుమాన్ సినిమా ఎంతో బాగుందని.. ఫాసినేటింగ్ అంటూ మూడున్నర స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా అదరగొట్టేశారని, గూస్ బంప్స్ మూమెంట్స్ మూవీలో చాలా ఉన్నాయని, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ ల్యాగింగ్‌గా ఉందని పేర్కొన్నారు.
‘దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ను రూపొందించారు. హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. పురాణాల ఆధారంగా డ్రామా, భావోద్వేగాలు, VFXతో అద్భుతంగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌ను అసాధారణ రీతిలో అద్భుతంగా ముగించారు. హనుమాన్‌లో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. తేజసజ్జ తన పాత్రకు ప్రాణం పోశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ తన మార్క్‌ను చూపించింది. మిగతా నటీనటులు కూడా మంచిగా చేశారు. వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే అద్భుతంగా ఉంది. కథకు తగ్గట్టే సాగింది.
ఎక్కడా అస్సలు డామినేట్ చేయలేదు. ప్రధాన పాత్రల డబ్బింగ్ కూడా మంచిగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ కొన్ని సీన్స్ ల్యాగింగ్‌గా ఉన్నాయి..’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ రివ్యూ సినిమాపై సాలిడ్ పాజిటివ్ బజ్ జనరేట్ చేస్తోంది. మరి హనుమాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.