పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా రేణు దేశాయ్(Renu Desai)
తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ పోస్టు పెట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత జానీ సినిమాలోనూ పవన్ కు జోడీగా కనిపించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సెటిల్ అయ్యింది. పవన్(Pawan Kalyan)తో విభేదాల కారణంగా ఈమె విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈమె ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
తాజాగా కొత్త ఏడాదిలో రేణు దేశాయ్(Renu Desai) తన కుమార్తె ఆధ్యాతో కలిసి కాశ్మీర్ కొండల్లో టూర్ కి వెళ్లింది. తన పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రేణు దేశాయ్ తరచూ పలు వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. పిల్లలతో విదేశాలకు వెళ్లి వస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా రేణు దేశాయ్(Renu Desai) ఎమోషనల్ పోస్టు పెట్టింది.
తన ఆరోగ్య సమస్యల గురించి ఎప్పుడూ చెప్పని రేణు దేశాయ్ ఇప్పుడు తనకున్న సమస్యను చెప్పుకుంది. ఈ మధ్య సెలబ్రిటీలు ఒక్కొక్కరూ తమ ఆరోగ్య సమస్యలను బయటపెడుతూ ఉన్నారు. తాజాగా రేణు దేశాయ్(Renu Desai) కూడా తన ఆరోగ్య సమస్య గురించి ఇన్ స్టాలో తెలియజేసింది. తాను గుండె, ఇతర ఆరోగ్య సమస్య(Health Problems)లతో బాధపడుతున్నానని ఎమోషనల్ పోస్టు చేసింది. తన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు శక్తిని కూడబెట్టుకుంటున్నానని, ఇలా ఎవరైనా బాధపడుతుంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకుండా బలంగా నిలబడాలంటూ రేణు దేశాయ్(Renu Desai) ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.