ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్(Prabhash) చేస్తున్న సినిమాలు మరో ఏ హీరో కూడా చేయడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్(Adipurush), సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు మారుతి(Director Maruthi) సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఇప్పటికే మారుతి సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇక ఇప్పుడు బాహుబలి మేకర్స్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవి అయిపోగానే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ మూవీ(Spirit Movie)ని పట్టాలెక్కించనున్నాడు. స్పిరిట్ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి మేకర్స్(bahubali Makers)తో బిగ్ ప్లానింగ్‌లో ఉన్నాడు. బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియాతో ప్రభాస్(Prabhash) ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌తో నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చర్చలు జరుపుతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
రాజమౌళి(SS Rajamouli)తో బాహుబలి 3 చేయాలనుకున్నా.. ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఇప్పుడు ప్రభాస్‌తో ఊహించని డైరెక్టర్ లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో బాహుబలి మేకర్స్ బిగ్ ప్లానింగ్‌లో ఉన్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan kalyan)తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు క్రిష్. గత రెండేళ్లుగా ఈ సినిమా డిలే అవుతునే ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఇంకొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత క్రిష్(Krish) చేయబోయేది ప్రభాస్ ప్రాజెక్టేనని టాక్ నడుస్తోంది. బాహుబలి మేకర్స్(bahubali Makers)తో క్రిష్‌కు మంచి అనుబంధమే ఉంది. కాబట్టి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యే అవకాశాలే ఎక్కువ. చూడాలి మరి ఏం జరుగుతుందో!