• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

బౌన్సర్లపై ప్రశ్నలకు బన్నీ సమాధానం ఇదే!

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బౌన్సర్ల గురించి ప్రశ్నించిన సందర్భంగా బన్నీ తడబడినట్లు తెలుస్తోంది. బౌన్సర్ల నియామకంపై, బౌన్సర్ల తీరుపై ఏం అడిగినా అల్లు అర్జున్ ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయాను’ అనే రీతిలో స్పందించినట్లు సమాచారం. కాగా, 2 రోజుల క్రితం అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అరెస్టు చేశారు.

December 24, 2024 / 01:33 PM IST

‘ఓయ్’ రీ రిలీజ్ డేట్‌ ఫిక్స్

తమిళ హీరో సిద్ధార్థ్, నటి షాలిని జంటగా నటించిన ‘ఓయ్’ సినిమా 2009లో రిలీజై పరాజయం పొందింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. 2025 జనవరి 1న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

December 24, 2024 / 01:09 PM IST

సంధ్య థియేటర్ ఘటన.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్?

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌లో గంటన్నరగా డీసీపీ ఆకాంక్ష్, ఆయన బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.

December 24, 2024 / 01:02 PM IST

ఎంతో గౌరవంగా ఉందంటూ రష్మిక పోస్ట్

అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ చిత్రబృందాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అభినందించింది. తాజాగా ఈ సంస్థకు రష్మిక థ్యాంక్స్ చెప్పింది. ఎంతో గౌరవంగా ఉందంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు రికార్డులను సొంతం చేసుకుంది.

December 24, 2024 / 12:50 PM IST

కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ

TG: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారణ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. కాగా, పీఎస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

December 24, 2024 / 12:45 PM IST

‘అన్‌స్టాపబుల్‌’కు వెంకటేష్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌-4’కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా ఈ షోకు స్టార్ హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌ ఈ నెల 27న రాత్రి 7 గంటలకు ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌‌లో భాగంగా వెంకీతో పాటు అనిల్ రావిపూడి ఈ షోకు వచ్చారు.

December 24, 2024 / 12:36 PM IST

3డి వెర్షన్‌లో ‘పుష్ప 2’ రిలీజ్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ సినిమా 3డి వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మువీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

December 24, 2024 / 12:26 PM IST

‘పుష్ప 2’ ALL TIME RECORD

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మంచి వసూళ్లు రాబడుతోంది. మరోవైపు టికెట్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుక్ మై షోలో మూవీ రిలీజైన 17 రోజుల్లోనే 18 మిలియన్స్ బుకింగ్స్‌తో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు KGF 2 17.01 మిలియన్స్ బుకింగ్స్‌తో టాప్‌లో ఉండగా.. తాజాగా దాన్ని ఈ మూవీ బ్రేక్ చేసి నెంబర్ 1గా నిలిచింది.

December 24, 2024 / 11:56 AM IST

అల్లు అర్జున్‌కు పోలీసుల ప్రశ్నలు ఇవే..?

1. సంధ్య థియేటర్‌ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?2. థియేటర్‌కు రావద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా?3. పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా? తెలియదా?4. రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 5. బెనిఫిట్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? 6. మీరు గానీ, మీ PR టీమ్‌గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?

December 24, 2024 / 11:32 AM IST

‘వార్ 2’పై హృతిక్ రోషన్ సాలిడ్ అప్‌డేట్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ 2’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై హృతిక్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘చివరి షెడ్యూల్‌తో వార్ 2 ముగుస్తుంది’ అని ట్వీట్ చేశాడు. ఇక ఈ షెడ్యూల్‌లో హృతిక్, NTR మధ్య జరిగే ఫైటింగ్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

December 24, 2024 / 11:14 AM IST

బన్నీపై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే

గత కొన్ని రోజులుగా సినీ హీరో అల్లు అర్జున్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ అరెస్ట్ గురించి తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంలో తాను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని అన్నాడు. ‘నేను ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉన్నందున దీనిపై మాట్లాడటం సరికాదు. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి’ అని జవాబు ఇచ్చాడు.

December 24, 2024 / 10:10 AM IST

కాసేపట్లో లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ

కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ కానున్నారు. అనంతరం తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లనున్నారు. బన్నీకి BNS 35(3) కింద నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఇవాళ బన్నీని చిక్కడపల్లి ACP రమేష్, సీఐ రాజు విచారించనున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.

December 24, 2024 / 09:28 AM IST

‘దేవర 2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభం..!

జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా శివ, తన టీం స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు వర్క్ చేస్తున్నారట. ఇక 2025లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్.

December 24, 2024 / 09:14 AM IST

ఉపేంద్ర ‘యూఐ’పై హీరోల ప్రశంసలు

నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’. ఈ మూవీ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఇది చూడదగ్గ సినిమా అని.. చాలా బాగుందంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంపై కన్నడ స్టార్ నటులైన యష్, కిచ్చా సుదీప్ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొచ్చారు.

December 24, 2024 / 08:27 AM IST

ఇవాళ బెనెగల్ అంత్యక్రియలు

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలను ఇవాళ ముంబైలో నిర్వహించనున్నారు. ఆర్థిక రాజధానిలోని శివాజీ పార్కులో బెనెగల్ అంత్యక్రియలను చేపట్టనున్నారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

December 24, 2024 / 07:25 AM IST