కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 2న ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటించిన మృత్యుంజయ్ చిత్రం.. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, మొదటి సారి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వైపు అడుగులు వేశాడు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం భారతీరాజా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
TVK చీఫ్, హీరో విజయ్‌కు ఆయన భార్య విడాకుల నోటీసులు పంపించారు. అందులో ఒక హీరోయిన్‌తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారానికి ఈ పరిణామం బలం చేకూర్చినట్లయింది.
తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్ దళపతికి భార్య సంగీత షాక్ ఇచ్చింది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత ఏడాది నుంచి వీరు విడిపోతారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడది నిజమైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఇకపై తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సొంతంగానే విడుదల చేయనుంది. ప్రస్తుతం హోంబలే చేతిలో ‘కాంతార-2’, ‘సలార్-2’, ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా ప్రదర్శనపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కొట్టివేసింది. దీంతో చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. వాదోపవాదాల అనంతరం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో, త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 75K డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ‘ది వైట్ లోటస్’ సీజన్-4లో కీలక పాత్రలో నటించే ఛాన్స్‌ను దీపిక వద్దనుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీపిక గతంలో ‘xXx: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకోగా.. వీటికి రికార్డు స్థాయిలో స్పందన లభించింది. విజయ్ పోస్ట్‌కు 13 మిలియన్లు, రష్మిక పోస్ట్‌కు 15 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. మొత్తంగా 28 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ఈ జంట సరికొత్త రికార్డు సృష్టించింది.
జాతకాలు, వాస్తును నమ్మే జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీవిష్ణు).. రెండు పెళ్లిళ్ల దోషంతో అవమానాలు పడే మనీషా (నయన్ సారిక) మధ్య సాగే వినోదాత్మక చిత్రమిది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ, టైమింగ్‌తో అదరగొట్టాడు. యువతను మెప్పించే మీమ్ కంటెంట్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ సీన్లు మూవీకి ప్లస్. రొటీన్ కథ, ఊహించినట్లే సాగే స్క్రీన్ ప్లే మూవీకి మైనస్. రేటింగ్:2.5/5.
ఈటీవీ విన్ తన సరికొత్త ఓటీటీ కంటెంట్‌ను ‘విన్ జాతర’ పేరుతో ప్రకటించింది. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేసింది. ఇందులో విరాజ్ అశ్విన్ నటించిన ‘గుర్తుకొస్తున్నాయి’, విభిన్న కథాంశంతో వస్తున్న ‘జిల్లేడు చెట్టు’, ఉత్కంఠభరితమైన ‘ది అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడ్-వై గోదావరి’ వంటి సినిమాలు ప్రధాన...