అల్లు అర్జున్‌ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు సినీ ప్రముఖులు ఐకాన్ స్టార్‌కు బాసటగా నిలిచారు. ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధాకరం. అయినప్పటికీ జరిగిన ఘటనకు ఒక్కరినే బాధ్యులుగా చేయటం సరికాదు.’ అంటూ అల్లు అర్జున్‌కు మద్దతుగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
మరో గంటలో చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల కానున్నారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆ ఆర్డర్ కాపీ తమకు అందలేదంటూ ఆయనను జైలు అధికారులు రాత్రంతా జైలులోనే ఉంచారు. అర్థరాత్రి సమయంలో ఐకాన్ స్టార్ తరఫు లాయర్లు ఆ ఆర్డర్ కాపీని అధికారులకు అందించారు. దీంతో ఇవాళ ఉదయం 7 గంటలకు ఐకాన్ స్టార్ జైలు నుంచి విడుదల కానున్నారు.
బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో అల్లుఅర్జున్ రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ను అండర్ ట్రైల్ ఖైదీగా పరిగణించి ఖైదీ నంబర్ 7697ను ఆయనకు కేటాయించినట్లుగా సమాచారం. అర్జున్ రాత్రంతా జైలులోని మంజీరా బ్యారక్‌లోనే ఉన్నారని.. ఆయనతో పాటు మరో ఇద్దరు విచారణ ఖైదీలు అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ వ...
బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో అల్లుఅర్జున్ రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ను అండర్ ట్రయల్ ఖైదీగా పరిగణించి ఖైదీ నంబర్ 7697ను ఆయనకు కేటాయించినట్లుగా సమాచారం. అర్జున్ రాత్రంతా జైలులోని మంజీరా బ్యారక్‌లోనే ఉన్నారని.. ఆయనతో పాటు మరో ఇద్దరు విచారణ ఖైదీలు అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ భోజనం చేయకుండా నేలపైనే పడుకున్నాడన...
జీ తెలుగు: షాదీ ముబారక్ (9AM), జాగో (11PM); ఈటీవీ: భలేవాడివి బాసూ! (9AM); జెమినీ: వెంకీ (8.30AM), అల్లుడు శ్రీను (3PM); స్టార్ మా మూవీస్: పార్టీ (7AM), సుబ్రమణ్యం ఫర్ సేల్ (9AM), మన్మధుడు (12PM), ఖిలాడి (3PM), వీరసింహారెడ్డి (6PM), మిర్చి (9PM); జీ సినిమాలు: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (7AM), అరవింద సమేత (9AM), డబుల్ ఇస్మార్ట్ (12PM), నాగవల్లి (3PM), KGF-2 (6PM), రావణాసుర (9PM).
స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. తన బిడ్డకు పాలు ఇస్తూ.. ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. కాగా, 2012లో బ్రిటన్‌కు చెందిన బెనెస్టిక్ టేలర్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. ప్రస్తుతం రాధికా పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేళ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘భద్రతా పరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే వాళ్లు చుట్టు పక్కల వారికి సూచిస్తుంటారు. ఏదైతే జరిగిందో అది బాధాకరమైన విషయం. ఒక వ్యక్తినే నిందించడం దురదృష్టకరం’ అని పేర్కొన్నాడు. ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో...
ఇటీవల ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. సినిమాల పరంగా కంటే వ్యక్తిగత సమస్యలతో టాలీవుడ్ నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులతో జానీ మాస్టర్ అరెస్ట్, ఎన్ కన్వెన్షన్ అంశం, సమంత-చైతూ విడాకుల విషయంలో నాగ్ ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నాయి.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు పవిత్రగౌడ తదితరులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ను జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మీడియా ప్రతినిధి రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. కాగా, మంచు ఫ్యామిలీలో వివాదాల నేపథ్యంలో జల్‌పల్లి నివాసం వద్ద జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్టుపై హైకోర్టులో విచారణ 4 గంటలకు వాయిదా పడింది. ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి నాలుగు గంటలకు వివరిస్తానని చెప్పారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు 4 గంటలకు వాయిదా వేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అప్రమత్తమయ్యారు. ‘విశ్వంభర’ షూటింగ్‌ను రద్దు చేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఇటీవల కాలంలో మెగా, అల్లు ఫ్యాన్స్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో చిరంజీవి.. బన్నీని కలిసేందుకు వెళ్లడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్’ 2023లో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2025 శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ...
సంధ్య థియేటర్ ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు సినీ ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే PSకు అల్లు అరవింద్, అల్లు శిరీష్ చేరుకోగా.. తాజాగా నిర్మాత దిల్ రాజు వచ్చారు. మరి కాసేపట్లో చిరంజీవి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. అలాగే ఆయన అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.