• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

పుష్ప టీంకు యష్‌రాజ్ ఫిలిమ్స్ ప్రశంసలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలై భారీ హిట్ అందుకున్న చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో మూవీ టీంను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ అభినందించింది. చరిత్ర తిరగరాశారంటూ పుష్ప టీంకు ట్వీట్ చేసింది. యష్‌రాజ్ ట్వీట్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ.. మంచి సినిమాతో పుష్ప-2 రికార్డులను యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్రేక్ చేయాలని ట్వీట్ చేశాడు.

December 24, 2024 / 07:17 AM IST

దృష్టంతా ‘డ్రింకర్ సాయి’ పైనే: నిర్మాత

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బసవరాజు లహరిధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘డ్రింకర్ సాయి సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవికి కథ చెప్పాం. ఆయన విని ఓకే ప్రొసీడ్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం’ అని తెలిపారు.

December 24, 2024 / 05:25 AM IST

వార్-2పై సాలిడ్ అప్‌డేట్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ దశలో ఉండగా.. హృతిక్ రోషన్ ఈ చిత్రంపై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘ఇది చివరి షెడ్యూల్‌తో వార్-2 ముగుస్తుంది’ అని ట్వీట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

December 24, 2024 / 03:50 AM IST

డిసెంబర్ 24: టీవీలలో సినిమాలు

జీ తెలుగు: అన్నవరం(9AM), బంపర్ ఆఫర్(11PM); జెమినీ: ఎవడైతే నాకేంటి(8.30AM), పెదబాబు(3PM); స్టార్ మా: బాహుబలి(9AM); స్టార్‌ మా మూవీస్: ముగ్గురు మొనగాళ్లు(7AM), ఎవడు(9AM), మట్టి కుస్తీ(12PM), మగధీర(3PM), బాహుబలి-2(6PM), పోకిరి(9PM); జీ సినిమాలు: లక్ష్మీ(7AM), నవ వసంతం(9AM), సైనికుడు(12PM), లౌక్యం(3PM), జయసూర్య(9PM). ఈటీవీ: బృందావనం (9AM).

December 24, 2024 / 02:34 AM IST

‘బరోజ్‌’పై మోహన్ లాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మలయాళ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘బరోజ్’. తాజాగా ఈ మూవీపై మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వాస్కోడిగామాలో ఉన్న రహస్య నిధిని నిజమైన వారసుడికి అందించడానికి బరోజ్ చేసే ప్రయత్నాలే మూవీ కథ. టెక్నాలజీని వాడుకుని యూనిక్‌గా 3డిలో తీశాం. ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు’ అని చెప్పారు. ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతుంది.

December 22, 2024 / 01:28 PM IST

‘తండేల్’ రెండో పాట రిలీజ్ వాయిదా

అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్‌’. ఈ మూవీలోని రెండో పాట ‘శివ శక్తి’ ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదలవుతుంది.

December 22, 2024 / 12:45 PM IST

అల్లు అర్జున్‌పై పూనమ్ కౌర్ ట్వీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ థియేటర్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమాను చూసినట్లు నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ‘పుష్ప 2 చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ చాలా బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతులను బాగా చూపించారు. అల్లు అర్జున్ కంటే గొప్పగా అలా ఇంకెవ్వరూ నటించలేరు’ అంటూ రాసుకొచ్చింది.

December 22, 2024 / 12:36 PM IST

నా చివరి వర్క్ డేను ముగించా: కృతి సనన్

2024 సంవత్సరానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్ నటి కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నేను 2024లో నా చివరి వర్క్ డేను ముగించాను. అద్భుతమైన టీంను కలిగి ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. చెడు రోజుల్లో వాళ్లు నాకు అన్ని విధాలుగా అండగా ఉండటంతో పాటు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చారు. ఇది నా రెండో ఫ్యామిలీ. మీరు లేకుండా నేనేమి చేస్తాను గాయ్స్’ అంటూ రాసుకొచ్చింది.

December 22, 2024 / 12:15 PM IST

సీఎం నిర్ణయం.. ఆ మూవీలపై ప్రభావం

TG: సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభావం రాబోయే మూవీలపై పడనుంది. ప్రస్తుతం థియేటర్లలో మూవీలు ఎక్కువగా ఆడటం లేనందున తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మూవీలు రాబోతున్నాయి.

December 22, 2024 / 12:14 PM IST

మూవీపై విలేకరి ప్రశ్న.. హీరో దిమ్మతిరిగే కౌంటర్

‘మ్యాక్స్’ ప్రమోషన్స్‌లో ఓ విలేకరి.. ఈ మూవీకి ఇంగ్లీష్‌లో పేరు ఎందుకు పెట్టారని హీరో సుదీప్‌ను అడిగారు. దీనికి ఆయన దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. తన ముందు పెట్టిన ఛానళ్ల మైక్‌లను చూపిస్తూ ‘ఇందులో చాలా వరకు పేర్లు ఇంగ్లీష్‌లోనే ఎందుకు ఉన్నాయి?. అసలు మీ సమస్య ఏంటి?. ఏ ఫర్ యాపిల్ అని చెబుతారు. కన్నడలో యాపిల్‌ను ఏమంటారో చెప్పండి’ అని ప్రశ్నించారు.

December 22, 2024 / 11:48 AM IST

‘వార్ 2’ మూవీ షూటింగ్‌పై నయా UPDATE

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ 2’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఓ భారీ షెడ్యూల్ కోసం తారక్ ముంబై వెళ్లారు. తాజాగా తారక్ లెంగ్తీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో హృతిక్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. సాంగ్స్ మినహా పూర్తి షూటింగ్‌ను జనవరి చివరి వారంలోగా పూర్తి ...

December 22, 2024 / 10:50 AM IST

‘తండేల్’ రెండో పాట రిలీజ్ టైం ఫిక్స్

నాగచైతన్య, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మూవీ ‘తండేల్‌’. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా రెండో పాట ‘శివ శక్తి’ రిలీజ్ టైం ఖరారైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు దీన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చందూ ముండేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నా...

December 22, 2024 / 10:30 AM IST

‘రాబిన్‌హుడ్‌’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన సినిమా ‘రాబిన్‌హుడ్‌’. ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మొదట ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు వార్తలు రాగా.. తాజాగా ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

December 22, 2024 / 09:20 AM IST

వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..!

ఇటీవల వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పొందాడు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ఈ మేరకు గాంధీ సాలిడ్ కథను సిద్ధం చేశాడని, ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ కథ కొరియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో రితికా నాయక్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

December 22, 2024 / 09:02 AM IST

‘విడుదల 2’ OTT అప్‌డేట్

తమిళ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ OTTపై దర్శకుడు వెట్రిమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ను OTTలో విడుదల చేయాలనుకుంటున్నాం. థియేటర్ వెర్షన్‌కు దాదాపు గంట నిడివి ఉన్న ఫుటేజ్‌ను యాడ్ చేసి విడుదల చేస్తాంR...

December 22, 2024 / 08:40 AM IST