బాలీవుడ్ నటి కియారా అద్వానీ, అలియా భట్‌లతో అనుచితంగా ప్రవర్తించాడంటూ నటుడు వరుణ్ ధావన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై వరుణ్ స్పందించాడు. ‘నేను అందరితో ఒకేలా ఉంటా. కియారాను కావాలని ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్‌లో భాగంగా అలా చేశాం. ఇక అలియా నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశానంతే. కావాలని చేయలేదు’ అని పేర్కొన్నారు.
సినీ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం నెలకొంది. చిన్నికృష్ణ తల్లి సుశీల(75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున మరణించారు. కాగా.. చిన్నికృష్ణ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్ బాబుకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మోహన్ బాబుకు హైకోర్టు ఇచ్చిన గడువు పూరైంది. అయినప్పటికీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దీంతో తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పర్సనల్ లైఫ్‌లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు సమయానికి వెళ్లేవాడినన్నారు. పైప్ స్మోకింగ్, మద్యంపానం చేసేవాడినని తెలిపారు. తప్పు చేశానని గ్రహించిన తర్వాత సినిమానే మార్పు తీసుకొచ్చిందన్నారు. సినిమా మెడిసిన్‌లాంటిదని పేర్కొన్నారు.
కన్నడ స్టార్ యష్ KGF-1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో యష్ విలన్ పాత్ర.. అంటే రావణుడి రోల్‌లో కనిపించనున్నాడు. అయితే.. ఈ పాత్రకు గాను యష్ దాదాపు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాఫిక్‌గా మారింది.
జీ తెలుగు: ప్రేమలు(9AM), ఏమాయ చేశావే(11AM); జెమినీ: అడవి రాముడు(8.30AM); స్టార్ మా: టిల్లు స్క్వేర్ (9AM), MCA(4PM) ; స్టార్ మా మూవీస్: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(9AM), రాజా ది గ్రేట్(12PM), నమో వెంకటేశ(3PM), అత్తారింటికి దారేది(9PM); జీ సినిమాలు: గర్జన(7AM), రెడీ(9AM), కాంచన-3(12PM), అ ఆ(3PM), నా పేరు సూర్య(6PM), అర్జున్ సురవరం(9PM). ఈటీవీ: మువ్వ గోపాలుడు(9AM).
ప్రముఖ సినీ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్క్ ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో బెనెగల్ అంత్యక్రియలు నిర్వహించారు. బెనెగల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రలు, అభిమానులు భారీ సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా, శ్యామ్ బెనెగల్ అనారోగ్యంతో నిన్న మరణించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘లైలా’. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి నయా అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు సోను మోడల్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.
తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగినట్లు, విజయ్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను స్టార్ హీరోయిన్ నయనతార తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా హిందీలో రూ.704.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి మూవీగా రికార్డు సృష్టించింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
TG: హీరో అల్లు అర్జున్ మూడున్నర గంటల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. పోలీసులు బన్నీకి రిమాండ్ రిపోర్టును చూపించారు. ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేర్చారు. మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లు A12 నుంచి A15 వరకు ఉన్నారు. వారి తీరు వల్లే తొక్కిసలాట, రేవతి మరణించిందని పోలీసులు తెలిపారు. అయితే, విచారణ అనంతరం బన్నీ భారీ బందోబస్తు మధ్య జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లారు.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడైన బౌన్సర్ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు నిన్న అరెస్టు చేశారు. సినిమా ఈవెంట్‌లు ఎక్కడ జరిగినా ఆంటోని బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తుంటాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సమయంలో కూడా ఆంటోని బన్నీకి సెక్యూరిటీగా ఉన్నాడు. కాసేపట్లో ఆంటోనిని సోలీసులు సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ మూవీని భూషణ్ కుమార్, రవి భాగచంద్కా నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సిద్ధాంత్.. యువరాజ్ సింగ్ బయోపిక్‌లో నటించడం కల అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయన ఈ మూవీలో నటిస్తున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా? అని అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించగా నోరు మెదపలేదు. తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించగా.. సైలెంట్‌గానే ఉన్నారు. అంతకుముందు విచారణ అధికారులు తొక్కిసలాట జరిగిన 10ని. వీడియోను బన్నీకి చూపించారు. రాత్రి 9:30 నుంచి థియేటర్ బయటకు వెళ్లే వరకు ఏం జరిగిందని ప్రశ్నించారు.
TG: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో రెండున్నర గంటలపాటు అల్లు అర్జున్‌ను విచారించారు. విచారణలో బన్నీ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో DCP ఆకాంక్ష్ విచారించారు. కాసేపట్లో పీఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు. అల్లు అర్జున్ వాహనాలతోపాటు పోలీసుల వాహనాలు సిద్ధం చేస్తున్నారు. భారీ భద్రతతో బన్నీని ఇంటికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.