మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల విడుదలైన ఓ మూవీలో పృథ్వీరాజ్ పేరు తొలగించాలని చూశారని వాపోయారు. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాలో సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కిస్తోన్న సినిమా ‘అన్నగారు వస్తారు’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 28న సాయంత్రం 5:04 గంటలకు తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల కానుంది. ఇక ఈ మూవీలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫోక్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల తాను పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాటపై ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడని HYDలోని SR నగర్ PSలో ఫిర్యాదు చేసింది. పాటను మాత్రమే కాకుండా ST సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడని ఆరోపించింది. కాగా, ఇటీవల ‘బాయిలోనే’ పాట యూట్యూబ్‌లో రిలీజ్ కాగా.. 8 మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.
తన భర్త, నటుడు ధర్మేంద్ర మరణాన్ని తలుచుకుంటూ హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా జీవితంలో అన్నీ ధర్మేంద్రనే. నా కష్టసుఖాల్లో తోడున్నాడు. ఆయన కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. కానీ వ్యక్తిగతంగా ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆ బాధ వర్ణించలేనిది. ఆయనతో కలిసి జీవించిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చారు’ అని పేర్కొంటూ ఫొటోలు పంచుకుంది.
మాస్ మహారాజా రవితేజ సరసన తమిళ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణతో రవితేజ చేస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిసున్నారట. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తోన్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్, శాటిలైట్ హక్కులను జీ తమిళ్ సొంతం చేసుకున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ 2026 JAN 23న విడుదల కానున్నట్లు సమాచారం.
తమిళ హీరో సూర్య, దర్శకుడు లింగుస్వామి కాంబోలో తెరకెక్కిన ‘సికిందర్’ మూవీ 11ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కాబోతుంది. ఈ నెల 28న రీ-రిలీజ్ కానున్న ఈ సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు చేశానని దర్శకుడు లింగుస్వామి తాజాగా చెప్పాడు. ఈ మూవీ విడుదలైనప్పుడు ఎంతోమంది ట్రోల్ చేశారని అన్నాడు. కొందరు కావాలని ట్రోల్స్ చేస్తారని, కానీ అవి ఒక మంచి సినిమాను ఆపలేవు అని తెలిపాడు.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార 1’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ కూడా సదరు OTTలోకి వచ్చింది. కాగా, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ రాగా.. హిందీలో రూ.200 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి.
‘రంగీలా’ మూవీలోని ‘హై రామా’ పాటకు ట్యూన్ చేయడానికి తాను, AR రెహమాన్ గోవాకి వెళ్లినట్లు దర్శకుడు RGV చెప్పాడు. అక్కడ ఐదు రోజులు ఉన్నా కూడా రెహమాన్ ట్యూన్ అందించలేదన్నాడు. రెహమాన్ తనతో ‘ఈసారి నన్ను హోటల్‌కు తీసుకెళ్లినప్పుడు TV లేని రూం కేటాయించండి.. ఎందుకంటే రూంలో ఉన్నంతసేపు టీవీ చూస్తూనే ఉంటాను’ అని చెప్పాడని, అతడిని కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపాడు.
దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ మూవీ సీక్వెల్‌లో ఆండ్రియా జెర్మియా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో న్యూడ్ కంటెంట్ ఉండనున్నట్లు వస్తోన్న వార్తలపై ఆండ్రియా స్పందించింది. ఈ మూవీలో న్యూడ్ కంటెంట్ ఉండదు.. కానీ చాలా ఎరోటిక్ సన్నివేశాలు ఉంటాయని చెప్పింది. స్క్రిప్ట్ దశలో న్యూడిటీ ఉండేదని, సెట్స్ మీదకు వచ్చేసారి దాన్ని తీసేశారని తెలిపింది.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న మూవీ ‘వానర’. HYDలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఇవాళ 3PMకు ఈ మూవీ టీజర్‌ను మంచు మనోజ్ లాంచ్ చేయనున్నాడు. టీజర్‌కు విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఇక సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సోషియో ఫాంటసీకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, నందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇవాళ ప్రభాస్ దీని షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది ఇవాళ్టి నుంచి డిసెంబర్ చివరి వరకు ఆయనపై షూటింగ్ కొనసాగనుందట. తదుపరి షెడ్యూల్ 2026 ప్రారంభంలో మెక్సికోలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ తాజాగా ఫిక్స్ అయింది. దీనికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరును ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుంది.
తన అభిమాన హీరో కోసం సాగర్(రామ్ పోతినేని) అనే యువకుడు ఏం చేశాడనే కథతో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తెరకెక్కింది. ఇవాళ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ మూవీలో రామ్ నటన, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. రామ్, ఉపేంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్, సాంగ్స్ మూవీకి ప్లస్. కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండటం మైనస్. రేటింగ్: 3/5.
➠ ఈటీవీ విన్‌లో ‘అర్జున్ చక్రవర్తి’, నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ అందుబాటులో ఉన్నాయి.➠ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ OTT రైట్స్ నెట్‌ఫ్లిక్స్, శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నాయి?➠ మహేష్ ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఈటీవీ ఛానల్‌లో ఈ ఆదివారం 10AMకు టెలికాస్ట్ కానుంది.