• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రానా దగ్గుబాటితో బోయపాటి సినిమా ?

రానా దగ్గుబాటి, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో భారీ యాక్షన్ మూవీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానాకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ కథ ఆయనకు సరిగ్గా సరిపోతుందని బోయపాటి భావిస్తున్నాడట. గతంలో రణ్‌వీర్ సింగ్‌కు అనుకున్న కథనే మార్పులు చేసి, అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇది రానా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కానున్నట్లు టాక్.

March 3, 2026 / 03:18 PM IST

పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే: రష్మిక

నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

March 3, 2026 / 02:48 PM IST

‘కాంచన’ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మార్చి 13, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ అయింది. మార్చి 4న సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.

March 3, 2026 / 02:30 PM IST

‘పెద్ది’.. ఆ రూమర్స్‌ నమ్మకండి: టీం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమా నిడివిపై వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. సినిమా 3 గంటల పైగా ఉంటుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉందని, కేవలం ఫస్టాఫ్ మాత్రమే ఎడిటింగ్ పూర్తయిందని తెలిపింది. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీం క్లారిటీ ఇచ్చింది.

March 3, 2026 / 02:07 PM IST

అప్పుడు విజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక

విజయ్ దేవరకొండను చూసి మొదట్లో భయపడ్డానని రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి బెరుకుగా ఉండేదని, అందుకే విజయ్‌తో నటించేటప్పుడు ఆందోళన పడ్డానని పేర్కొంది. విజయ్ చాలా కూల్ అని, అతని వల్ల సెట్‌లో పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు.

March 3, 2026 / 01:59 PM IST

విజయ్, రష్మిక రిసెప్షన్‌.. హై టెక్ భద్రత

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో వైభవంగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఈ వేడుకకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆహ్వానితులకు పంపిన ‘వన్ టైమ్ క్యూఆర్ కోడ్’ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. ఆహ్వానం లేని వారు రావొద్దని నిర్వాహకులు కోరారు. ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

March 3, 2026 / 01:25 PM IST

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం

జీ 5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’ వెబ్‌సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో కృష్ణ పోలూరు తెరకెక్కించిన ఈ థ్రిల్లర్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరిత కథనంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

March 3, 2026 / 01:08 PM IST

‘వృషకర్మ’ గ్లింప్స్‌కు టైం, వేదిక ఫిక్స్

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్‌ దండు కాంబోలో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌కు టైం, వేదిక ఖరారైంది. మార్చి 5న ఉదయం 10 గంటలకు HYDలోని ప్రసాద్ PCX  స్క్రీన్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

March 3, 2026 / 01:03 PM IST

8 నెలలు మంచానికే పరిమితం అయ్యాను: స్నేహ

నటి స్నేహ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఘోర ప్రమాదం గురించి గుర్తుచేసుకుంది. ‘ఆ ప్రమాదంలో కాళ్లు, చేతులు, వీపుకు తీవ్ర గాయాలవ్వడంతో డాక్టర్స్ 8 నెలలు బెడ్ రెస్ట్ సూచించారు. నా కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో దర్శకుడు కరు పళనియప్పన్ పార్థిబన్ కనవు కథతో కలిశారు. కదలలేని స్థితిలో ఉన్నా ఆయన చూపిన నమ్మకమే నన్ను మళ్లీ వెండితెరకు పరిచయం చేసింది’ అని పేర్కొంది.

March 3, 2026 / 12:56 PM IST

ఈ వారం ఓటీటీ మూవీలివే..!

➠ ‘విత్ లవ్’- నెట్‌ఫ్లిక్స్ – మార్చి 6➠ ‘హలో బచ్చో’ – నెట్‌ఫ్లిక్స్ – మార్చి 6➠ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ – ఆహా – మార్చి 4➠ ‘చరిత కామాక్షి’ – ఈటీవీ విన్ – మార్చి 5➠ ‘గాంధీ టాక్స్’ – జీ5 – మార్చి 6➠ ‘సుబేదార్’ – అమెజాన్ ప్రైమ్ -మార్చి 5.

March 3, 2026 / 12:26 PM IST

ఈ వారం థియేటర్ చిత్రాలు ఇవే!

➠’మృత్యుంజయ్’- మార్చి 6➠’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’- మార్చి 6➠’మెన్షన్ హౌస్ మల్లేష్’- మార్చి 6➠’సరస్వతి’, ‘కాన: ది ఫారెస్ట్’- మార్చి 6➠’మిషన్ సి 1000′, ‘విధాత’- మార్చి 6➠ప్రభాస్ మున్నా మార్చి 6న రీ-రిలీజ్.

March 3, 2026 / 12:06 PM IST

ఓటీటీలోకి వచ్చేసిన ‘తన్వి ది గ్రేట్‌’

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తన్వి ది గ్రేట్’. ఆటిజంతో బాధపడుతున్న ఒక యువతి, ఆర్మీలో చేరి తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చింది అనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సుభాంగీ దత్ ప్రధాన పాత్రలో నటించగా.. కీరవాణి సంగీతం అందించాడు.

March 3, 2026 / 12:04 PM IST

శ్రద్ధా కపూర్ సంపాదన ఎంతో తేలుసా?

శ్రద్ధా కపూర్ 2010లో సినీరంగంలోకి వచ్చి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో వచ్చిన విజయాలతో ఆమె నికర సంపద రూ.130 కోట్లకు చేరింది. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు తీసుకుంటూ, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. లగ్జరీ కార్లు కలిగి, అధిక పారితోషికం అందుకుంటున్న టాప్ నటీమణులలో ఆమె ఒకరిగా నిలిచారు.

March 3, 2026 / 11:38 AM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటపై UPDATE

పవన్‌ కళ్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మార్చి 26, 2026న విడుదల కానుంది. ఈ మూవీలో కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయని, నెక్స్ట్‌ వచ్చే సాంగ్‌ భారీ లెవల్లో ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. మార్చి 4న ఈ పాటపై అప్‌డేట్ రానుందని చెప్పాడు. దీంతో ఈ పాట నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

March 3, 2026 / 11:22 AM IST

ఓటీటీలోకి ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మార్చి 12 లేదా 13న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 3, 2026 / 11:10 AM IST