దృశ్యం సినిమా గురించి మలయాళి స్టార్ హీరో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ సినిమా కథ నా కంటే ముందు వేరే హీరోలకు చెప్పారు కానీ వాళ్లు ఎవరూ అంగీకరించలేదన్నాడు. చివరకు ఆ కథ నేను విన్నా. నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని పేర్కొన్నాడు. ఈ సినిమాకు ఎన్నో రీమేక్స్ వచ్చాయి. వాటిని పూర్తిగా చూడలేదన్నాడు. దృశ్యం 3 త్వరలోనే పట్టాలెక్కనుందని వెల్లడించాడు.
మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు. ‘కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో మన్మోహన్ పాత్రను చేయకూడదనుకున్నా. కానీ, అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించే అవకాశం అందరికీ రాదని ఒప్పుకున్నాను. మన్మోహన్ గొప్ప నాయకుడు. ఆ చిత్రం వివాదాస్పదం కావొచ్చు. ఆయన మాత్రం వివాదరహితుడే’ అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో హీరో విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి బాలయ్యతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణి నీరజ గురించి ఆయన మాట్లాడారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతానని వెంకటేశ్ తెలిపారు.
హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ్టితో కస్టడీ సమయం ముగుస్తుంది. దీంతో నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ వివరాలు కోర్టుకు తెలపనున్నారు.
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. 61 ఏళ్ల వయసున్న ఆయన ఆసుపత్రిలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తమిళంలో విజయ్ కాంత్ హీరోగా ‘భారతన్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత ప్రభుదేవాతో ‘వీఐపీ’, జగపతి బాబుతో ‘పందెం’ సహా పలు సినిమాలను తెరకెక్కించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీ స్టారర్ మూవీ ‘సింగం అగైన్’. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా, 2011లో సింగం సినిమా రాగా.. దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు.
కలెక్షన్స్‌తో కాదు పెర్ఫామెన్స్‌తో ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు . సినీ ఇండస్ట్రీలో తాజా పరిణామాలపై ఆయన మాట్లాడారు. ‘ప్రజలకు ఉపయోగపడేలా మూవీలను తీయాలి. హీరో రెమ్యూనరేషన్ భారం ప్రజలపై వేస్తున్నారు. కమర్షియల్ సినిమాపై వ్యాఖ్యానించే హక్కు లేకపోవచ్చు.. కానీ, ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడకుండా ఉంటే చాలు’ని పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న HYDలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2025 జనవరి 10న విడుదలవుతుంది.
బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటుంది. వీరి రిలేషన్‌పై అర్జున్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని తెలిపాడు. దీనిపై మలైకా తాజాగా స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌లో పెట్టడం తనకు నచ్చదని, అర్జున్ తన లైఫ్ గురించి తనకు నచ్చింది చెప్పడంలో తప్పు లేదని వెల్లడించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రిలీజైన 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1705 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన ఏకైక సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.
TG: బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని CM రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేసినా CM తగ్గలేదు. అయితే ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్యవర్తిగా దిల్ రాజ్ వ్యవహరించారు. ‘గేమ్ ఛేంజర్’ను దృష్టిలో పెట్టుకునే CM అపాయింట్మెంట్ తీసుకున్నారని.. కానీ, దిల్ రాజు వ్యూహం బెడిసికొట్టిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మీరేమంటారు.?