• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మోక్షజ్ఞ తదుపరి ప్రాజెక్టుపై సాలిడ్ అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదే తన తొలి సినిమా. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తదుపరి ప్రాజెక్టుపై సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించాడు.

December 28, 2024 / 03:40 PM IST

చిరంజీవి అభిమానితో బాలయ్య సినిమానా…..?

దర్శకుడు బాబీ మెగాస్టార్‌ వీరాభిమాని. తన ఆఖరు చిత్రం కూడా మెగాస్టార్‌తో వాల్టేర్‌ వీరయ్య సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చి రికార్డులకెక్కాడు. అటువంటింది బాబీ, బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే వార్త బైటకొచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానజనం ఒక్కసారి కనుబొమ్మలెత్తారు. ఏం జరుగుతోంది.....మాకు వెంటనే తెలియాలి అన్నట్టుగా తుళ్ళిపడ్డారు.

December 28, 2024 / 03:24 PM IST

నాగవంశీ ఏం మాట్లాడుతున్నారు..?

వంశీ ఊరికే సినిమా తీసి, రిలీజు చేసి, డబ్బులు లెక్క పెట్టుకుని కామ్‌గా ఉండే రకం కాదు. సినిమాకి తనదైన ఓ ప్రత్యేకతను అద్దడంలో ఆయనదో సెపరేట్‌ రూటు. ఎక్కడో అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ అనమాట.

December 28, 2024 / 03:16 PM IST

చిరంజీవి, ఓదెల మూవీపై సాలిడ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత సాహు గారపాటి అప్‌డేట్ ఇచ్చాడు. తాము ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న కొన్ని వార్తలను నమ్మొద్దని వెల్లడించాడు.

December 28, 2024 / 03:03 PM IST

PHOTO: బేబీ బంప్‌తో సమంత

టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో సమంత బేబీ బంప్ ఫొటోలు తయారు చేశారు. ఈ ఫొటోల సాయంతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

December 28, 2024 / 01:47 PM IST

రియల్‌లైఫ్‌ స్టోరీతో ధనుష్‌ సినిమా!

ధనుష్‌ డైరీలో ఓ కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని సమాచారం. ‘అమరన్‌’ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. నిజానికి రాజ్‌కుమార్‌ ఓ బాలీవుడ్‌ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. అయితే.. ఆ సినిమాకంటే ముందే ధనుష్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

December 28, 2024 / 08:39 AM IST

REWIND 2024: పెళ్లి చేసుకున్న స్టార్లు

FEBలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ.. అదే నెలలో తాప్సీ-డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. జూన్‌లో సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. జూలైలో వరలక్ష్మి శరత్ కుమార్-నికోలయ్ సచ్ దేవ్.. AUGలో కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్.. SEPలో సిద్ధార్థ్-అదితీరావు హైదరీ.. DECలో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల.. కీర్తి సురేశ్-ఆంటోనీ తట్టిల్ ఒక్కటయ్యారు.

December 28, 2024 / 08:08 AM IST

టీఆర్‌పీలో టాప్ లేపిన బిగ్ బాస్

హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 8 టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకెళ్లింది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షో ఫైనల్ రోజున అర్బన్ ఏరియాలో 10.14, అర్బన్‌లో 12.93 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకుంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్‌గా నిఖిల్ నిలిచి టైటిల్ గెలుచుకోగా.. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.

December 27, 2024 / 09:46 PM IST

మహానటుడంటే రాజేంద్రప్రసాద్‌ కదా…..

కామెడీని కరివేపాకులా తీసిపారేసే రోజుల నుంచి కామెడీని ఫుల్‌ లెంత్‌ ఎంటర్‌టైన్మెంట్‌గా మార్చి, దానికి మళ్ళీ హీరోస్థాయిని కల్పించడం మహామహుల వల్లే కాలేదు. పెద్ద హీరోల పక్కన కామెడీ చేసి, చివరంటా కమెడియన్లుగానే మిగిలిపోయిన చరిత్ర మొత్తం మన కళ్ళ ముందే ఉంది. కానీ ఒక్క పేరు మాత్రం మినహాయింపుగా నిలబడింది. ఆ పేరే రాజేంద్రప్రసాద్‌

December 27, 2024 / 04:32 PM IST

నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్: అమితా బచ్చన్

అల్లు అర్జున్‌పై బిగ్ బీ అమితా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పారు. బన్నీ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని.. జాతీయ అవార్డుకు అతను అర్హుడు అని కొనియాడారు. తనను అల్లు అర్జున్‌తో పోల్చవద్దని ఓ గేమ్ షోలో పాల్గొన్న బిగ్ బి అన్నారు.

December 27, 2024 / 03:59 PM IST

విశ్వక్‌సేన్ లైలా మూవీపై సాలిడ్ అప్‌డేట్

విశ్వక్‌సేన్-రామ్ నారాయణ్ కాంబోలో తెరకెక్కుతున్న లైలా సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ మెరవనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్న మేకర్స్ తాజాగా ఈ చిత్రంలోని సోనూ మోడల్ సాంగ్ గురించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ప్రోమో రేపు ఉ.11.07గం.లకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

December 27, 2024 / 03:51 PM IST

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ టాక్ వచ్చేసింది..!

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్ అని సెకండాఫ్ సూపర్ అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ నటకు భారీగా మార్కులు పడుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

December 27, 2024 / 03:40 PM IST

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ టాక్ వచ్చేసింది..!

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్ అని సెకండాఫ్ సూపర్ అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ నటకు భారీగా మార్కులు పడుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

December 27, 2024 / 03:40 PM IST

దగ్గుబాటి హీరోకు తండ్రిగా ప్రమోషన్

దగ్గుబాటి యువ హీరో తండ్రయ్యాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్- ప్రత్యూషలు అమ్మానాన్నలయ్యారు. ప్రత్యూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా వీరి వివాహం గతేడాది శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే.

December 27, 2024 / 03:29 PM IST

దిల్‌రాజు తొలి ఘన విజయం

ఒక్కోసారి ఒక్క వ్యక్తి మొత్తం సీన్‌ని మార్చేయగలుగుతాడు. ఇప్పటి స్థితిగతులలో ఆ ఒక్కడే దిల్‌ రాజు అనబడే ఈ శక్తి. శక్తి అని ఎందుకు రాయాల్సివచ్చిందటే ఇటువంటి అస్తవ్యస్తమైన వ్యవహారాన్ని సర్దుబాటు చేయడం అంత సులభమైన విషయం కానేకాదు. దానికెంతో లోతైన వ్యక్తిత్వం, అనుభవం అంతకుమించిన విశ్వసనీయత చాలా అవసరమవుతాయి

December 27, 2024 / 03:25 PM IST