• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘సతీ లీలావతి’ విడుదల వాయిదా

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం వాయిదా పడింది. మార్చి 6, 2026న విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా.. ఎక్కడా రాజీపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.

March 3, 2026 / 10:51 AM IST

యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్!

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘టాక్సిక్’. ఈ మూవీ పారితోషికం విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వార్తల్లో నిలిచింది. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, నిర్మాతలతో చర్చల తర్వాత రూ.12 కోట్లకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

March 3, 2026 / 10:22 AM IST

ప్రియుడిని చంపిన నటి.. అరెస్ట్

తన ప్రియుడు మోహనకృష్ణ (45)ను హత్య చేయించిన కేసులో నటి ఊర్వశి బెంగళూరులో అరెస్టయ్యింది. వినయ్ అనే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె, పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో మోహనకృష్ణను కత్తితో పొడిచి చంపించింది. భర్తకు దూరంగా ఉంటున్న ఊర్వశి పలు కన్నడ చిత్రాల్లో నటించింది. ఈ క్రూరమైన పథకంలో ఆమెకు సహకరించిన వినయ్, మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

March 3, 2026 / 10:10 AM IST

ప్రముఖ నటుడి ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

March 3, 2026 / 10:01 AM IST

నా సినిమానే ‘తేరి’ కోసం వాడారు: హ‌రీష్ శంక‌ర్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విజయ్ దళపతి ‘తేరి’ మూవీకి రీమేక్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. మొదట రీమేక్‌గా భావించినా, తర్వాత కథను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశాడు. కథ, మాటలు, దర్శకత్వం తనవే అయినప్పుడు రీమేక్ అనడం సరికాదన్నాడు. ‘గబ్బర్ సింగ్’లోని అంశాలే ‘తేరి’లో కనిపించాయని, ఇప్పుడు తన సినిమానే రీమేక్ అనడంపై ఆయన అసహనం వ్యక్తం ...

March 3, 2026 / 09:50 AM IST

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ.. కానీ!

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మార్చి 4 నుంచి సాధారణ సబ్‌స్క్రైబర్స్‌కి అందుబాటులోకి రాబోతుంది.

March 3, 2026 / 09:40 AM IST

అల్లు అర్జున్ లైనప్‌లో క్రేజీ సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్‌తో ‘పుష్ప 3’, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ‘AA23’ మూవీలు చేయనున్నాడు. అలాగే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో ‘AA24’ మూవీ చేయనున...

March 3, 2026 / 09:26 AM IST

‘తుంబాడ్ 2’లోకి ‘సైంధవ్’ విలన్

2018లో సెన్సేషన్ సృష్టించిన ‘తుంబాడ్’ మూవీకి సీక్వెల్ రాబోతుంది. దర్శకుడు అనిల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌కు పార్ట్-2 సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీని మేకర్స్ ఖరారు చేశారు. ఆయన రాకతో ఈ హారర్ థ్రిల్లర్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి.

March 3, 2026 / 09:04 AM IST

‘సలార్ 2’పై హైప్ పెంచేసిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్ 2’ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత విజయ్ గుడ్‌న్యూస్ చెప్పాడు. ‘సలార్ 2’ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించాడు. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అలాగే, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని విజయ్ కితాబిచ్చాడు.

March 3, 2026 / 09:01 AM IST

‘అవరాపన్ 2’.. మలేసియాలో ముగింపు సన్నివేశాలు

హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం ‘అవరాపన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్‌ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

March 3, 2026 / 08:16 AM IST

ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి దారుణం!

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంది. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తామని పెద్దలు చెబుతున్నా, వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని యువ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్‌లలో స్టోరీ లిజనర్స్ కొత్త వారిని కలవడానికి ఇష్టపడరని, అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఆఖరి నిమిషంలో అబద్ధాలు చెబుతారని వాపోతున్నారు.

March 3, 2026 / 08:14 AM IST

స్పోర్ట్స్‌ డ్రామాలో శ్రీలీల?

బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కబీర్ ఖాన్‌తో తెరకెక్కిస్తున్న మూవీలో శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ కిక్ బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

March 3, 2026 / 07:56 AM IST

విజయ్ చుట్టూ ’27’ గండం!

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ’27’ నంబర్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. గతేడాది SEP 27న కరూర్ తొక్కిసలాట, OCT 27న బాధితుల పరామర్శ, DEC 27న సినిమా ఆడియో లాంచ్ వివాదం.. ఇలా అన్నీ 27వ తేదీనే జరిగాయి. తాజాగా FEB 27న భార్య సంగీత 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకుల పిటిషన్ వేయడం సంచలనమైంది. MAR 27న కోర్టులో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

March 3, 2026 / 07:17 AM IST

నటి కారుకు ప్రమాదం.. డ్రైవర్‌ దుర్మరణం

ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న ముత్తుగణేష్ అక్కడికక్కడే మృతిచెండాడు. దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె పీఏ దివాకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

March 3, 2026 / 05:45 AM IST

ఆరోగ్యకరమైన నిద్ర కోసం..!

శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రాత్రి పూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం, చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీనితో పాటు, పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండటం వల్ల మెదడు త్వరగా విశ్రాంతి పొంది గాఢ నిద్ర పడుతుంది.

March 2, 2026 / 09:27 PM IST