దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. ఆస్కార్ అవార్డ్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 అకాడమీ అవార్డ్స్‌కు ‘చెల్లో షో’ అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ పరిశీలనకి పంపించిన సంగతి తెలిసిందే.
అయితే దీని వెనక పెద్ద ఎత్తున రాజకీయం జరిగిందనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ కోసం పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మొత్తం 15 క్యాటగిరీలలో ఎంట్రికీ పంపిస్తున్నారు. దాంతో జనరల్ కేటగిరీలో.. RRRకు ఖచ్చితంగా ఆస్కార్‌కు నామినేషన్లు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, ఉత్తమ సహాయ నటులు అజయ్ దేవగన్ మరియు అలియా భట్.. ఈ జనరల్ కేటగిరీలో ఉన్నారు. అలాగే ‘నాటు నాటు’ పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది. దీంతో పాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్.. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ మేకప్ & హెయిర్‌స్టైలింగ్ విభాగాల్లో నామినేషన్స్‌కు పంపించారు.
ఈ నేపథ్యంలో.. ఇండియా తరపున ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పంపించిన ‘ఛెల్లో షో’ ఆస్కార్ కొల్లగొడుతుందా.. లేదా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచి సత్తా చాటుతుందా.. అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇప్పుడు ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ వర్సెస్ ఛెల్లో షోగా మారింది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగల్సిందే.