ఫలానా సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కథ లిక్ అయిందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఓజి అంటే ఒరిజనల్ గ్యాంగ్ స్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ముంబైని గడగడలాడించిన ఓజి అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా ఆ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజి టీజర్ అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ‘దే కాల్ హిమ్ ఓజి’ టైటిల్‌తో వచ్చిన టీజర్లో పవన్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. అయితే టైటిల్ ఓజినే అయినా.. ఓజి అంటే ఒజస్ గంభీర అని తెలుస్తోంది.
కానీ ఈ టీజర్ ఇచ్చిన హైప్‌తోనే పోయేలా ఉన్నామని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీ చూస్తే.. తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ‘ఓజస్ గంభీరా అనే కామన్ మ్యాన్ ముంబైకి టూరిస్టుగా వస్తాడు. కొన్ని అనుకొని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ముంబైని ఊచకోత కోసి తనకంటూ ఓ మాఫియా సామ్రజ్యాన్ని స్థాంపిచుకుంటాడు.
ఈ ప్రయాణంలో అతను తన కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. అందుకు కారణమైన వారిపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. అలాగే డ్రగ్ మాఫియాను పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు’ అనేదే ఓజి కథ అని తెలుస్తోంది. ఇదే కథను ఐఎమ్‌డీబీ సంస్థ తన సైట్లో రాసుకొచ్చింది. దీంతో ఓజి స్టోరీ లీక్ అనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఇక ఈ స్టోరీకి తగ్గట్టే.. ఒక పవర్ స్టార్ అభిమానిగా ఓజిని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఓజి మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడం లేదు. మరి ఇంత భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఓజి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాను ఎక్కడుంది? ఏం చేస్తుందో అన్ని ఫోటోల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఆమె డల్ గా కనపడింది. ఫోటోలు చూసి సమంత ఏంటి? ఇలా అయిపోయింది అని చాలా మంది కామెంట్స్ చేశారు.