సినిమాను తీయడం, బిజినెస్ చేయడం ఎంత రిస్కో..రిలీజ్ డేట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. కొన్నిసార్లు రిజల్ట్ బాగున్నా కలెక్షన్స్ పై గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
Naveen Polishetty is unnecessarily involved with Shah Rukh khan jawan movie
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా జోష్‌లో ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు నవీన్. కాస్త గ్యాప్ తీసుకుని ఆచితూచి అడుగులేస్తూ..అదిరిపోయే సబ్జెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మరో వైపు షారుఖ్ ఖాన్(Shah Rukh khan) పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉంది. ఇదే ఇప్పుడు నవీన్ కొంపముంచేలా ఉందంటున్నారు. తెలుగు సినిమాల నుంచి పోలిశెట్టికి పోటీ లేకపోయినా.. షారుఖ్ సినిమాకు సాలిడ్ టాక్ రావడం.. కాస్త ఎఫెక్ట్ చూపించేలానే ఉంది.
తెలుగులో జవాన్ ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. కానీ మాస్ సినిమా అవడంతో బి, సి సెంటర్లలో ఆడియెన్స్ థియేటర్స్‌కు పరుగులు పెడుతున్నారు. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై జవాన్ ఎఫెక్ట్ బాగానే పడేలా ఉంది. సోషల్ మీడియాలో జవాన్ గురించే చర్చ జరుగుతోంది. ఫస్ట్ డే దాదాపు రూ.120 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది జవాన్(jawan). మిస్ శెట్టి మిస్టర్ శెట్టికి నాలుగు కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి.. వీకెండ్ వరకు వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే జవాన్ మ్యానియాలో పోలిశెట్టి కొట్టుకుపోయేలా ఉన్నాడు. సరోగసీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటున్నారు. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.