Naveen Polishetty: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టికిి యాక్సిండెంట్ జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గురువారం ఉదయం నుంచి ఇదే వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ప్రమాదం ఎలా జరిగింది. షూటింగ్లో జరిగిందా లేదా మరేదైనా ప్లేస్లో జరిగిందా అనేదాంట్లో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. అమెరికాలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, చికిత్స తీసుకోవడం కూడా జరిగిందట. ప్రమాదం కారణంగా చేతికి ఫ్రాక్చర్ అయితే దానికి వైద్యులు కట్టు వేశారు. రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. ఎలా జరిగింది అనేది తెలియదు. దీనిపై హీరో నవీన్ కానీ, ఆయన టీమ్ కానీ స్పందించలేదు.
నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్, పంచులతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చీ, ఆ తరువాత జాతిరత్నాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత అనుష్క శెట్టి కాంబినేషన్లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటించి మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు వింటున్నట్లు సమాచారం. తన చివరి సినిమా తరువాత హాలీడే కోసం అమెరికా వెళ్లిన ఆయనకు ఇలా జరగడంతో హీరో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆయన టీమ్ నుంచి ఎవరైన స్పందిస్తే ఫ్యాన్స్ కాస్త ఊపిరి తీసుకుంటారు. ఇదే సందర్భంలో ఆయనపై వచ్చే ఈ వార్తలను కొందరు కొట్టేస్తున్నారు. నిజనిజాలు తెలియాలంటే అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.