»Was There Room For Jack Cinemas Most Debated Prop Sells For 700k
Titanic : వేలంలో ఆ టైటానిక్ తలుపును ఎంతకొన్నారో తెలిస్తే షాకే!
టైటానిక్ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ సముద్రంలో తేలియాడుతున్న తలుపు చెక్కపై ఉండే సీన్ అందరికీ గుర్తే. ఆ తలుపు చెక్క ఇప్పుడు రికార్డు ధరలకు వేలంలో అమ్ముడు పోయింది. ఎంతకంటే..
‘Titanic’ driftwood ‘door : టైటానిక్ క్లైమాక్స్ సీన్లో హీరోయిన్ రోజ్ని రక్షించడం కోసం హీరో కేట్ జాక్ ఆమెను తేలియాడే ఓ తలుపు చెక్కపైకి చేరుస్తాడు. తర్వాత తాను ప్రాణాలు విడిచే సన్నివేశాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సన్నివేశంలో వాడిన తలుపు చెక్క ఇప్పుడు వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. అది ఏకంగా రికార్డు స్థాయిలో 718,750 డాలర్లకు అమ్ముడు పోయింది. అంటే మన రూపాయల్లో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు. హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్లో ఈ టైటానిక్(Titanic) ప్రోప్ అత్యధిక వసూలు సాధించిన వస్తువుగా నిలిచింది.
నిజానికి అది అసలు తలుపు చెక్కే కాదట. ఓడ ఫస్ట్ క్లాస్ లాంజ్ గుమ్మం దగ్గర పైన ఉన్న డోర్ ఫ్రేమ్‌లోని భాగాన్నే తలుపు చెక్కగా చూపించినట్లు నిర్మాతలు తెలియజేశారు. దీనితో పాటుగా విన్స్లెట్ వాడిన షిఫాన్ దుస్తులు సైతం ఈ వేలంలో 1,25, 000 డాలర్లకు అమ్ముడు పోయాయట. అంటే దాదాపుగా 1.5కోట్లకన్నామాట.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్(Titanic) సినిమా అప్పట్లో పెద్ద సంచలన విజయం సాధించింది. చాలా భాషల్లోకి డబ్ అయింది. టైటానిక్ షిప్ మునిగిపోవడం, 1500 మంది మృత్యువాత పడిన విషాద సంఘటనలతో పాటు ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం ఇప్పటికీ అందరి కళ్ల ముందూ కదలాడుతుంది. క్లైమాక్స్‌లో హీరోయిన్ తలుపు చెక్కను ఆశ్రయించి ఉండటమూ అందరికీ గుర్తొస్తుంది. బహుశా అందుకనేనేమో ఈ షూటింగ్ ప్రోప్ ఇంత భారీ ధరకు అమ్ముడయ్యింది.