Titanic శకలాలు చూసేందుకు ఇదే మా ఆహ్వానం: ఓషియన్ గేట్
టైటాన్ సబ్ మెర్సిబిల్ ప్రమాదం మరచిపోకముందే టైటానిక్ షిప్ చూసే ఆఫర్ చేస్తోంది ఓషియన్ గేట్ కంపెనీ. వచ్చే ఏడాది జూన్ నెలలో రెండు ట్రిప్స్ ఉంటాయని చెబుతుంది. ప్రమాదం జరిగి కొద్దిరోజులే కాగా.. కొత్తగా ట్రిప్ ప్రకటించడంతో కంపెనీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Oceangate Offer: టైటానిక్ షిప్ (titanic ship) శకలాలు అట్లాంటిక్ మహాసముద్రం 13 వేల అడుగుల లోతులో ఉన్నాయి. వాటిని చూసేందుకు కొందరు సాహస యాత్రికులు ముందుకు వస్తున్నారు. ఇటీవల టైటాన్ (titan) సబ్ మెర్సిబిల్ తీవ్ర పీడనం వల్ల పేలిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారు. ఒక్కొక్కరు రూ.2 కోట్లు పెట్టి మరీ వెళ్లారు. వారి యాత్ర విషాదంగా ముగిసింది.
ఆ ప్రమాద ఘటన మరచిపోకముందే మరో సంస్థ ముందుకు వచ్చింది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ (titanic) శకలాలను చూసేందుకు ఓషియన్ గేట్ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది రెండు ట్రిప్ వేస్తున్నామని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్య ఫస్ట్ ట్రిప్ ప్లాన్ చేసింది. 21వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య మరో ట్రిప్ ఉండనుంది. టైటాన్ సబ్ మెర్సిబిల్ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే సాహస యాత్ర ప్రకటించడంతో ఓషియన్ గేట్ (Oceangate) కంపెనీ తీవ్ర విమర్శల పాలవుతోంది.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ (titanic) మునిగిపోయిన సంగతి తెలిసిందే. సముద్ర గర్భంలో ఉన్న వాటి శిథిలాలను చూపించే ప్రయత్నాన్ని ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్ అనే టూరిజం కంపెనీ చేస్తోంది. ఇందుకోసం చిన్న జలాంతర్గామిని ఉపయోగిస్తోంది. ఇందులో ముగ్గురు అతిథులు, ఓ పైలట్, మరో నిపుణుడు ఉంటారు. జలంతర్గామి 22 అడుగు పొడవు, 10,431 కిలోల బరువు ఉంటుంది. 4 వేల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే యాత్ర కోసం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. యాత్రలో 400 మైళ్ల దూరం ట్రావెల్ చేస్తారు.