Mukesh Ambani Gifted Golden Cradle To Ram Charan Daughter
Mega Princes: మెగా ఇంట ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram charan Teaja)- ఉపాసన (upasana) దంపతుల కూతురు బారసాల ఈ రోజు జరగనుంది. సాయంత్రం చిన్నారికి సంప్రదాయ బద్దంగా పేరు పెడతారు. తర్వాత తొట్లేలో వేసి ఊపుతారు. జో.. లాలి పాప అంటూ పాటలు పాడతారు.
సెలబ్రిటీ కపుల్ పాప బారసాల అయినందున ఏర్పాట్లు కూడా అదే రేంజ్లో ఉన్నారు. చిన్నారి (infant) పేరును కూడా ఫిక్స్ చేశారట. చిరంజీవి (chiranjeevi) ఇష్టదైవం ఆంజనేయ స్వామి కలిసేట్టు పేరు పెడతారని తెలిసింది. కొద్దీ మంది స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వేడుక జరగనుంది.
చరణ్ (charan) కూతురు బారసాలకు బిలియనర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (mukesh ambani) ఖరీదైన గిప్ట్ పంపించారని తెలిసింది. బారసాల అంటేనే ఊయల.. అందుకోసం బంగారు ఊయలను తయారు చేయించారట. 2 కేజీల బంగారంతో చేసిన ఊయలకు రూ.1.20 కోట్ల ఖర్చు అయ్యిందని తెలిసింది. ఆ ఊయలలోనే చిన్నారికి బారసాల చేస్తారని తెలుస్తోంది.
ఇటీవల రామ్ చరణ్ (ram charan)- ఉపాసన (upasana) దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. తల్లీ బిడ్డ బాగుండటంతో 3వ రోజునే ఉపాసనను చరణ్ ఇంటికి తీసుకెళ్లారు. చరణ్-ఉపాసనకు పెళ్లైన 11 ఏళ్లకు సంతానం కలిగింది. మెగా ఇంటికి వారసురాలు రావడంతో సంబరంలో మునిగింది.