Maya Petika Full Movie Review: మాయా పేటిక మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొబైల్ థీమ్‌గా తీసుకొని తెరకెక్కించారు. మూవీకి శ్రీనివాస్ రెడ్డి, సునీల్- శ్యామల జంట ప్లస్ నటన పాయింట్ అయ్యింది.
కథ:
మాయాపేటిక మూవీ మొబైల్ గురించి ఉంది. వివిధ వర్గాల జనం మధ్య ఆ ఫోన్ ఎందుకు ఉంది. ఆ ఫోన్ ఉండటం వల్ల వారి జీవితాల్లో జరిగిన పరిణామాలు ఏంటీ..? ఆ మొబైల్ వల్ల వారు పడిన ఇబ్బందులు ఏంటీ అనేదే చిత్ర కథాంశం. ఇంతకీ ఆ మొబైల్ ఎందుకు అంత ప్రత్యేకం, అందులో ఏముందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
మూవీ మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతుంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దానిని తెరపై చక్కగా చూపించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి మొబైల్ మారడం ఓకే.. ఎమోషన్స్ మిస్ అయ్యాయని జనాలు అంటున్నారు. ఇలాంటి మూవీ తీసే సమయంలో థ్రిల్లింగ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వస్తోంది. మొబైల్ చుట్టూ జరిగే తంతును చూపించి.. థియేటర్లకు జనాన్ని వచ్చేలా చేయడం అసాధ్యం అంటున్నారు.
ఎవరెలా చేశారంటే..?
మూవీలో శ్రీనివాస్ రెడ్డి నటన హైలెట్. ట్రాన్స్ జెండర్‌గాను నటించి మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సునీల్, శ్యామల జంట కామెడీ కూడా మూవీకి ప్లస్ అయ్యింది. టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు, అతని భార్య రత్నం పాత్రలను పోలి ఉంటారు. పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్ రోల్ పోషించారు.
సాంకేతిక విభాగాల పనితీరు
కథ బానే ఉన్నా.. తెరపై ఆ ఇంపాక్ట్ మిస్ అయ్యింది. డైరెక్టర్ రమేశ్ రాపర్తి 6 షార్ట్ స్టోరీస్ తీసుకున్నా ఫలితం లేదు.. మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సురేశ్ రగుత్ కెమెరా పనితనం బాగుంది. క్లైమాక్స్ పార్ట్ అద్భుతంగా తీశారనే పేరు వచ్చింది. గుణ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఫర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు.
ప్లస్
+ శ్రీనివాస్ రెడ్డి నటన
+ సునీల్, శ్యామల ట్రాక్
+ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్
– ఆకట్టుకొని ఫస్ట్ హాఫ్
– 3 స్టోరీలకు జరగని న్యాయం
– వీక్ క్లైమాక్స్