Avatar2: “టైటానిక్” రికార్డును బ్రేక్ చేసిన “అవతార్2”
ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్(James cameron) "అవతార్2"(Avatar2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించారు. ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమైన విజువల్ వండర్ గా ఉంటుందని అందరికీ తెలుసు. తాజాగా అవతార్2(Avatar2) సినిమా టైటానిక్ కలెక్షన్స్ ను దాటేసి రికార్డు నెలకొల్పింది.
ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్(James cameron) “అవతార్2″(Avatar2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించారు. ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమైన విజువల్ వండర్ గా ఉంటుందని అందరికీ తెలుసు. కలెక్షన్ల పరంగా కూడా ఆయన సినిమాలో ముందంజలోనే ఉంటాయి. అప్పట్లో ఆయన తీసిన “టైటానిక్”(Titanic) సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన అవతార్ సినిమాతో మరో సెన్సేషన్ ను క్రియేట్ చేశారు. జేమ్స్ కామెరూన్(James cameron) ఏ సినిమా చేసినా అది బంపర్ హిట్ అవ్వడం ఖాయం. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి.
గత డిసెంబర్ లో ఆయన తెరకెక్కించిన అవతార్2(Avatar2) రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీని తెచ్చింది. అవతార్2 సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొట్టేసింది. జేమ్స్ కామెరూన్(James cameron) అద్భుతమైన సృష్టికి ఆడియన్స్ నీరాజనాలు పలికారు. అవతార్ సినిమా మొదటి భాగంలో పండోరా గ్రహంలోని కథను ప్రేక్షకులకు జేమ్స్ కామెరూన్(James cameron) చూపించారు. ఆ తర్వాత అవతార్2(Avatar2) సినిమాతో ప్రేక్షకులను ఆయన సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్ తో మాయ చేసి మరో కొత్త ప్రపంచంలోకి లాక్కెళ్లాడనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అవతార్2(Avatar2) హవానే కొనసాగుతోంది. ఇండియాలో అవతార్2 సినిమాకు ఎండింగ్ కార్డు పడింది. అయితే పక్క దేశాలలో ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా అవతార్2(Avatar2) సినిమా టైటానిక్ కలెక్షన్స్ ను దాటేసి రికార్డు నెలకొల్పింది. టైటానిక్ పేరుతో ఉన్న రికార్డును అవతార్2(Avatar2) చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్3 ప్లేస్ ను అవతార్2(Avatar2) కైవశం చేసుకుంది. మొదటి రెండు స్థానాల్లో అవతార్1, అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలు నిలిచాయి. మిక్స్డ్ టాక్ తోనే ఈ రేంజ్ లో అవతార్2(Avatar2) కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇండియాలోనూ అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఇండియాలో ఈ సినిమా రూ.386.90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.