ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల ఇంకా స్క్రిప్టు చెక్కుతునే ఉన్నాడని..
మొదటి నుంచి వినిపిస్తునే ఉంది. అయితే ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు.. బయటకొచ్చిన ఫోటో ఒకటి నందమూరి అభిమానులను కాస్త ఊరట ఇచ్చింది. డిసెంబర్ లేదా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్తుందని వినిపించింది. కానీ ప్రస్తుతం ఎలాంటి అప్టేట్ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
2023 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నెక్ట్స్ దసరాకు రిలీజ్ అనుకున్న ఎన్టీఆర్30 థియేటర్లోకి రావడానికి మరింత ఆలస్యం కానుందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న ఎన్టీఆర్ 31 కూడా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. కొరటాల తర్వాత ఎన్టీఆర్ 31ని వచ్చే సమ్మర్లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 30నే ఫ్రిబ్రవరి అంటున్నారు కాబట్టి..
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవనుందని అంటున్నారు. మొత్తంగా ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్‌తో లైన్లో ఉన్న బుచ్చిబాబు మరో హీరో వేటలో ఉన్నట్టు టాక్. మరి ఎన్టీఆర్30 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.