AKP: పాయకరావుపేట మండల సర్వసభ్య సమావేశం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు సర్పంచులు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించామన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు.