నటి నిత్యామీనన్ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ మలయాళీ భామ తెలుగు చక్కగా మాట్లాడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపూరంలో సందడి చేశారు. షూటింగ్ తర్వాత స్థానిక గవర్నమెంట్ స్కూల్కు వెళ్లారు. కాసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు. వాటిని తెలుగులోను వివరించారు. అమె కుర్చీలో కూర్చొని విద్యార్థులకు కథను చెప్పారు.
ఇదంతా సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదు. కృష్ణాపురం చిన్నారులతో తన కొత్త సంవత్సరం ఇలా గడిచింది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. గ్రామాల్లోని చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారని రాసుకొచ్చారు. వాళ్లు తన చుట్టూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటానని పేర్కొన్నారు. ఈ వీడియోకు లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు తీస్తున్నారు నిత్య.