»Nayanthara And Vigneshan Checked The News With A Single Photo
Nayanthara: ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన నయనతార
నయనతార తన భర్త విఘ్నేష్ ఇద్దరు విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నయనతారా షేర్ చేసిన ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పడింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Nayanthara and Vigneshan checked the news with a single photo
Nayanthara: తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) తన భర్త డైరెక్టర్ విఘ్నేష్(Vignesh) విడిపోతున్నట్లు ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. వీటిన్నంటికి చెక్క పెడుతూ నయనతారా ఓ ఫోటో షేర్ చేసింది. దాంతో ఇటీవల ప్రచారం జరిగిన అన్ని వార్తలు వట్టి పుకార్లు అని తేలిపోయింది. విషయం తెలిసిన తన అభిమానులు ఖుషీగా ఉన్నారు. తన ఇద్దరి కుమారులతో పాటు తన భర్త విఘ్నేష్‌తో కలిసి వేకేషన్‌కు వెళ్తున్నారు. కొన్ని రోజులు క్రితం రిలేషన్ షిప్ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అప్పటి నుంచి వీరు విడుపోతున్నారంటూ ప్రచారం జరిగింది. దానిపై నయనతార కానీ, విఘ్నేష్ కానీ స్పందించలేదు. దీంతో ఇద్దరు విడిపోతున్న విషయం నిజమేనని ఆ వార్తలు ఊపందుకున్నాయి.
ఇక వాటికి ప్రత్యేకంగా సమాధానం ఇవ్వకేండా సింపుల్‌గా ఒక ఫోటోను షేర్ చేసింది. దాంతో అందరి నోర్లు మూతపడ్డాయి. భర్త విఘ్నేష్‌తో పాటు తమ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తూ.. చాలా కాలం తరువాత నా బాయ్స్ తో కలిసి వేకేషన్‌కు వెళ్తున్నాను అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి నయనతార జెడ్డా టూర్‌కి వెళ్లినట్లు సమాచారం. నయనతార, విఘ్నేష్ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో నయనతారకు సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలను పొందారు.