ప్రభాస్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ రాబోతోంది. సాహో, రాధే శ్యామ్‌తో నిరాశలో ఉన్న అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా త్రిబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. ఒక్క ప్రభాస్ చేతిలో మాత్రమే భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’.. ఈ మూడు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అలాగే ఇప్పటికే కమిట్ అయిన ‘సందీప్ రెడ్డి వంగ’ స్పిరిట్ కూడా అదే రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కబోతోంది. మొత్తంగా ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 1800 కోట్ల వరకు ఉంటుంది. అందుకే ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయం
. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. సలార్, ప్రాజెక్ట్ కె ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. అయితే వీటిలో సలార్ లుక్ మరియు రిలీజ్ డేట్ తప్పితే.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె గురించి ఎలాంటి లుక్ రివీల్ కాలేదు. దాంతో ఒకేసారి ఈ సినిమాల నుంచి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ బర్త్ డేకు మరో నెల రోజులు మాత్రమే ఉంది. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డేకు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ రానుందని తెలుస్తోంది. ఆదిపురుష్‌తో పాటు సలార్, ప్రాజెక్ట్ కె.. సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈ లోపే దసరాకు ‘ఆదిపురుష్’ అప్డేట్ రానుందని తెలుస్తోంది. అయినా ప్రభాస్ బర్త్ డేకు ఓవర్ డోస్ ఇవ్వనున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.