VZM: గరివిడి మండలం ఎం.దుగ్గివలస పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే కళా వెంకటరావు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. సిబ్బందిని భోజన నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.